Site icon NTV Telugu

Baby: దర్శకేంద్రుడిని మెప్పించిన ‘బేబీ’…

Baby

Baby

ఒక స్టార్ హీరో నటించిన హిట్ సినిమా రేంజ్ హంగామాని… ఒక చిన్న సినిమా  క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అన్ని పనులు పక్కన పడేసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్‌ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఆ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ‘బేబీ’ మూవీ రెండు రోజుల్లోనే 14 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కల్ట్ హిట్ అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో బేబీ మూవీ కలెక్షన్స్ ఓవర్సీస్ లో కూడా పీక్స్ లో ఉన్నాయి.

రోజు రోజుకీ బుకింగ్స్ పెరుగుతూ ఉండడంతో బేబీ సినిమా రేంజ్ మారుతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చేయనంత బజ్ ని జనరేట్ చేస్తున్న బేబీ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చూసి ఇంప్రెస్ అయ్యారు. సోషల్ మీడియాలో తన స్పందన తెలిపిన దర్శకేంద్రుడు, బేబీ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేసాడు. తెలుగు సినిమాకి కమర్షియల్ రంగులు అద్దిన దర్శకేంద్రుడే ‘బేబీ’ సినిమాని మెచ్చుకోవడంతో దర్శకుడు సాయి రాజేష్ “మీ ఘరానా మొగుడు సినిమా చూసాకే దర్శకుడు అవ్వాలి అనిపించింది సర్” అంటూ హ్యాపీగా రెస్పాండ్ అయ్యాడు. చూస్తుంటే బేబీ సినిమా ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు, జులై 28న బ్రో రిలీజ్ అయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర బేబీ స్లో అయ్యే అవకాశమే కనిపించట్లేదు.

Exit mobile version