Baby: దర్శకేంద్రుడిని మెప్పించిన ‘బేబీ’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక స్టార్ హీరో నటించిన హిట్ సినిమా రేంజ్ హంగామాని… ఒక చిన్న సినిమా క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అన్ని పనులు పక్కన పడేసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఆ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ‘బేబీ’ మూవీ రెండు రోజుల్లోనే 14 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కల్ట్ హిట్ అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో బేబీ మూవీ కలెక్షన్స్ ఓవర్సీస్ లో కూడా పీక్స్ లో ఉన్నాయి.
రోజు రోజుకీ బుకింగ్స్ పెరుగుతూ ఉండడంతో బేబీ సినిమా రేంజ్ మారుతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చేయనంత బజ్ ని జనరేట్ చేస్తున్న బేబీ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చూసి ఇంప్రెస్ అయ్యారు. సోషల్ మీడియాలో తన స్పందన తెలిపిన దర్శకేంద్రుడు, బేబీ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేసాడు. తెలుగు సినిమాకి కమర్షియల్ రంగులు అద్దిన దర్శకేంద్రుడే ‘బేబీ’ సినిమాని మెచ్చుకోవడంతో దర్శకుడు సాయి రాజేష్ “మీ ఘరానా మొగుడు సినిమా చూసాకే దర్శకుడు అవ్వాలి అనిపించింది సర్” అంటూ హ్యాపీగా రెస్పాండ్ అయ్యాడు. చూస్తుంటే బేబీ సినిమా ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు, జులై 28న బ్రో రిలీజ్ అయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర బేబీ స్లో అయ్యే అవకాశమే కనిపించట్లేదు.
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Watched #babymovie, thoroughly enjoyed it..!
Well written and directed by #SaiRajesh
Amazing performances by #ananddevarakonda, #vaishnavichaitanya #viraj Ashwin, Mind blowing music and back ground score. pic.twitter.com/0N1ruTI1yk
— Raghavendra Rao K (@Ragavendraraoba) July 16, 2023
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!