NTV Telugu Site icon

Sridevi: ముగ్గురు చెల్లెళ్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’

Sridevi

Sridevi

అతిలోక సుందరిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరోయిన్ ‘శ్రీదేవి’. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉండే శ్రీదేవి అంటే ప్రతి తెలుగు వాడికి ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరు, నాగార్జున, వెంకటేష్… ఇలా అప్పటి తెలుగు టాప్ హీరోలు అందరితో నటించిన శ్రీదేవి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ కూడా జెండా ఎగరేసింది. హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవికి సంబంధించిన ఒక ఓల్డ్ ఫోటో బయటకి వచ్చింది. ఇందులో శ్రీదేవితో పాటు తన ముగ్గురు చెల్లెల్లు ఉన్నారు. నగ్మా, రోషుని, జ్యోతికలు శ్రీదేవితో పాటు దిగిన ఫోటోలో అతిలోక సుందరి ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న విశేషం ఏంటి అంటే ఇందులో ఉన్న నలుగురితో సినిమాలు చేసిన ఘనత ఒక్క హీరోకి మాత్రమే దక్కింది, అతనే మెగాస్టార్ చిరంజీవి. శ్రీదేవితో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్.పి పరశురామ్, రాణికాసుల్ రంగమ్మ సినిమాలు చేసిన చిరు, నగ్మాతో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు సినిమాలు చేసాడు. వీటిలో ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

రోషుని, జ్యోతికలతో చిరు చేసింది ఒక్క సినిమా మాత్రమే. మాస్టర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ‘రోషుని’ నటించింది. వినాయక్ డైరెక్ట్ చేసిన ‘ఠాగూర్’ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జ్యోతిక హీరోయిన్ గా నటించింది. రోషుని, జ్యోతికలతో చిరుకి రెండు సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా ఒకే ఫ్యామిలీలోని నలుగురు హీరోయిన్స్ తో హీరోగా సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే దక్కింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా, చిరంజీవి కొడుకు హీరోగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని చిరు చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు. మరి ఎన్టీఆర్ 30 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న జాన్వీ కపూర్ ని, చరణ్ ని ఒక దగ్గర చేర్చే జగదేక వీరుడు అతోలోక సుందరి ప్రాజెక్ట్ ని ఎవరు సెట్ చేస్తారో చూడాలి.

Show comments