NTV Telugu Site icon

Jaya Kumari: దారుణ స్థితిలో సీనియర్ నటి.. ఆదుకోవడానికి ఒక్కరు లేరే

Jaya

Jaya

Jaya Kumari: తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో 400 కు పైగా చిత్రాల్లో నటించింది ఆమె. తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి తమిళ్ ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ లాంటి హీరోలందరితో కలిసి నటించింది. అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ గా విరాజిల్లిన ఆమె ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి ఆసరా కోసం చేయి చాస్తోంది. రెండు కిడ్నీలు పాడైపోవడంతో తనను దాతలు ఎవరైనా బతికించాలని కోరుకొంటుంది. ఆ నటి పేరు జయకుమారి. తమిళ్ లో నాడోడి అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన జయ కుమారి తెలుగులో క్యుడ ఎన్టీఆర్, కాంతారావు సరసన నటించింది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అబ్దులా అనే వ్యక్తిని వివాహమాడిన ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఈమెకు ఇద్దరు కొడుకులు. ప్రస్తుతం వీరు చెన్నైలో నివసిస్తున్నారు. భర్త కొంతకాలం క్రితమే మృతిచెందడంతో వీరు ఆర్థికంగా చితికిపోయారు. ఇక ఇటీవలే జయకుమారి రెండు కిడ్నీలు పూర్తిగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటున్న కొడుకులు ఆమెకు వైద్యం చేయించే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీంతో ఆమె కొడుకులని ఇబ్బంది పెట్టలేక చెన్నైలోని ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది. దాతలు ఎవరైనా ఆమెకు సాయం చేస్తే బావుంటుందని ఆమె సన్నహితుల వద్ద వాపోవడం బాధాకరంగా ఉంది. ఇప్పుడున్న స్టార్స్ ఎవరైనా ఆమెను ఆదుకోవడానికి వస్తారేమో చూడాలి.