NTV Telugu Site icon

Pushpa 2: ఈ లీకులే సగం సినిమాని బయట పెట్టేలా ఉన్నాయి…

Pushpa 23

Pushpa 23

సుకుమార్… అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్ర చందనం స్మగ్లర్ కథని చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లి కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్-అల్లు అర్జున్… ఆగస్టు 15 రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని పెట్టి మరీ పుష్ప షూటింగ్ ని చేస్తున్నారు. రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఉండేలా షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు. ఇటీవలే 48 రోజుల పాటు గంగమ్మ జాతర ఎపిసోడ్ ని షూట్ చేసాడు సుకుమార్. 12 నిమిషాల పాటు గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్ ని తెరకెక్కించిన సుకుమార్… ఈ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయితే యూనిట్ పై సీరియస్ అయ్యాడు. చీర కట్టుకోని  కుర్చీలో కూర్చోని ఉన్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ లీక్ దెబ్బకి సోషల్ మీడియా పుష్ప 2 పేరుతో మోగిపోయింది. లీకులు కాకుండా సుకుమార్ అండ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటే ఇప్పుడు మరో లీక్… పుష్ప 2 నుంచి బయటకి వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన లీకులో రావు రమేష్ పార్టీకి సంబందించినది కావడం విశేషం. పుష్ప సినిమాలో “ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు” పాత్రలో కనిపించిన రావు రమేష్… ఎర్ర చందనం సిండికేట్ కి హెడ్. పార్ట్ 1లో ఈ సిండికేట్ ని పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడు షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ “ప్రజా చైతన్య పార్టీ” అనే ఫ్లెక్సీలు బయటకి వచ్చాయి. ఈ లీకులని సుకుమార్ ఎలా అయినా ఆపాల్సిందే లేదంటే ఇంకా ముఖ్యమైన విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.