Site icon NTV Telugu

Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’

Laya. Shivaji

Laya. Shivaji

నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈటీవీ విన్ బ్యానర్‌పై సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. దసరా శుభాకాంక్షల సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి లయ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘ఉత్తర’ అనే గృహిణి పాత్రలో నటిస్తోంది. తన కుటుంబం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతమైన మహిళగా ఈ పాత్రను డిజైన్ చేశారని చిత్ర బృందం తెలిపింది. “తన కుటుంబం జోలికి వస్తే ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధపడే గృహిణి ఉత్తర. ఈ పాత్రలో లయ అద్భుతమైన నటన చూపించనుంది” అని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే, ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషనల్ ట్రాక్ కూడా బలంగా ఉండబోతోందని సమాచారం. ఇందులో అలీ, ధనరాజ్, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version