Site icon NTV Telugu

Raghava Lawrence : రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. వైరల్ అవుతున్న మరో ట్వీట్..

Laernce

Laernce

తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాత్రం ’ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో జరిగింది..

ఇక మొన్న వికలాంగులకు స్కూటీలను అందజేశారు.. ఆయన ఒక ట్రస్ట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం అందించారు.. ఎందరో అనాధలకు అన్నగా మారి సేవ చేస్తున్నాడు.. లారెన్స్ సంపాదించే ప్రతి రూపాయి ఇలా సాయం చెయ్యడానికి ఉపయోగిస్తున్నారు.. తాజాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లను అందజేసీ గొప్ప మనసు చాటుకున్నాడు..

ఇదిలా ఉండగా.. తాజాగా లారెన్స్ ఓ ట్వీట్ చేశారు.. ఆ ట్వీట్ లో హాయ్ సోదరులు మరియు సోదరీమణులు.. మా మాత్రమే కుటుంబానికి మిమ్మల్ని స్వాగతించడానికి మేము సంతోషిస్తున్నామ.. మీ మద్దతు మరియు ఆశీర్వాదాలతో మా మాత్రం సేవా ఉద్యమం ద్వారా సేవా మరియు దయ యొక్క విలువలను నిలబెట్టడానికి మేము కృషి చేస్తున్నాము.. అందరం కలిసి మరో ప్రపంచాన్ని తీర్చి దిద్దుదాం అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

 

Exit mobile version