Site icon NTV Telugu

Lavanya Tripati: విశాఖ బీచ్ లో ‘మిస్ పర్ఫెక్ట్’ సందడి…

Lavanya Tripati

Lavanya Tripati

జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లినింగ్ కార్యక్రమం చేపట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాటి. లావణ్య త్రిపాఠి తో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్. అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చిన లావణ్య త్రిపాటి. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందురు చూడాలి అని ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా నటించానని చెప్పుకొచ్చింది. తను నటిచింన వెబ్ సీరీస్ హాట్ స్టార్ స్పెషల్ “మిస్ పెర్ఫెక్ట్ ” ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమం లో లావణ్య త్రిపాఠి పాల్గొనింది.

Read Also: Mrunal Thakur: ఆ అవకాశాలు ఇచ్చే అంత పాపులర్ కాదు నేను…

వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం, డిస్నీ హాట్ స్టార్ వారు సంయుక్తంగా బాగస్వాములు అయ్యారు. ఈ సంధర్బంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశామని గుర్తు చేసుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తూ… బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని చెప్పింది.

Read Also: Suhaas: చిన్న సినిమా కోసం మాస్టర్ ప్లాన్…

Exit mobile version