Lavanya Tripathi: ఎట్టకేలకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. అధికారికంగా మెగా కోడలిగా మారిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి గత ఐదేళ్లుగా ప్రేమించుకొని.. ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి నిన్న ఇటలీలో ఒక్కటయ్యారు. మెగా, అల్లు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితులు మొత్తం కలిపి 120 మంది హాజరయ్యినట్లు సమాచారం. ఇక నిన్నటి నుంచి వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గోల్డ్ కలర్ షేర్వాణీలో వరుణ్ తేజ్.. ఎరుపు రంగు కాంచీవరం చీరలో లావణ్య ఎంతో అందంగా కనిపించారు. ఇక ఈ ఫోటోల తరువాత లావణ్య చీర గురించే చర్చ మొదలైంది. ఆ చీర ఎవరు డిజైనర్ చేశారు.. ? ఆ చీర ధర ఎంత.. ? అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే పూర్తి డిటైల్స్ తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ చీర గురించి రకరకాల ధరలు వినిపిస్తున్నాయి.
Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా
ఇక ఈ కాంచీవరం చేరాను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు. తెలుగు సంప్రదాయం ప్రకారం.. ఈ చీరను డిజైన్ చేయించుకుందట లావణ్య. ప్రేమకు చిహ్నమైన ఎరుపును.. మంచి మనసును సూచించే గోల్డ్ ను కలగలిపి మనీష్ మల్హోత్రా ఈ చీరను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ చీర ధర.. దాదాపు రూ. 7 నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మెగా కోడలు రేంజ్ కు తగ్గట్టు.. పెళ్లి చీరను డిజైన్ చేయించిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరో రెండు మూడు రోజులు ఈ జంట ఇటలీలో ఉండి.. నవంబర్ 4 న ఇండియాకు రానున్నారట. నవంబర్ 5 న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం అటెండ్ కానుంది.