Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లావణ్య ప్రేమించి పెళ్లాడింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో అత్యంత బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్ళికి మెగా, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఇక ఇటలీలో పెళ్ళికి.. ఇండస్ట్రీని పిలవలేకపోయారు. ఇక దీంతో నవంబర్ 5 న వీరి రిస్పెషన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. గతరాత్రి వీరి రిసెప్షన్.. మాదాపూర్ లోని N కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం అటెండ్ అయ్యింది. సినీ, మీడియా ప్రముఖులు మొత్తం హాజరు అయ్యారు. ఇక ఈ రిసెప్షన్ లో లావణ్య త్రిపాఠి హైలైట్ గా నిలిచింది. చీరకట్టులో ఆమె ఎంతో అందంగా కనిపించింది.
Rashmika Mandanna: బ్రేకింగ్.. డీప్ ఫేక్ వీడియో.. స్పందించిన రష్మిక
రిసెప్షన్ కు సెలబ్రిటీలు చాలా రేర్ గా చీర కట్టుకుంటారు. లావణ్య సైతం గోల్డ్ కలర్ డిజైనర్ చీర.. మెడలో పసుపుతాడు.. నుదుటున కుంకుమతో అచ్చ తెలుగు కోడలిగా కనిపించి అందరిని షాక్ కు గురిచేసింది. ఇక ఈ వేడుక తరువాత లావణ్య చీర గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. దాని ధర ఎంత అని సెర్చ్ కూడా చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చీర ఖరీదు దాదాపు రూ. 2.75 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఇలాంటి చీరనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఒక ఫంక్షన్ లో కట్టుకుంది. ప్రస్తుతం ఈ చీరకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.