NTV Telugu Site icon

Lavanya Tripathi: మెగా కోడలకు అరుదైన వ్యాధి.. లావణ్య ఏమన్నదంటే..?

Lavanya

Lavanya

Lavanya Trpathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి ఉంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏంటి నిజమా.. అని కంగారుపడకండి. అది నిజమే.. ఆ విషయాన్ని లావణ్యనే స్వయంగా చెప్పింది. కానీ, ఇప్పుడు కాదు. రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె తాను ట్రిపోఫోబియా అనే వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పినట్టు చెప్పుకొస్తున్నారు. ట్రిపోఫోబియా అంటే.. ఏదైనా వింత ఆకారాలను, వింత వస్తువులు, రంధ్రాలు ఉన్న, గడ్డలు కట్టిన వస్తువులను చూసి భయపడడం. ఇది మెంటల్ డిసార్డర్ అని చెప్పలేం. సడెన్ గా ఒక వింత ఆకారాన్ని కానీ.. వింత వస్తువును చూసి అందరు భయపడతారు. కానీ, లావణ్య వాటిని చూసి మరింత భయపడి స్పృహ తప్పుతుందట. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆమె చాలానే ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చిందట. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తాలూకు క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ గా మార్చేస్తున్నారు నెటిజన్స్. అయితే తాజాగా ఈ న్యూస్ పై లావణ్య స్పందించింది. ” నాకు వింతవ్యాధినా..? నాకు తెలిసినంత వరకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు నేను మిమ్మల్ని ఏం చేయాలి..? ” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Pawan Kalyan: జగన్ ను ఇమిటేట్ చేసిన పవన్.. వీడియో వైరల్

మిస్టర్ సినిమా సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిన ఈ చిన్నది ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించి గత నెల ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో లావణ్య కనిపించనుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే వరుణ్- లావణ్య పెళ్లి ఇటలీలో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.

Show comments