NTV Telugu Site icon

Lavanya: నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ తీసుకున్నాం.. బాంబు పేల్చిన లావణ్య

Raj Tarun Drugs

Raj Tarun Drugs

Lavanya Says she Consumed Drugs with Raj Tarun: లావణ్య ఎన్టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. నా జీవితంలో నేను డ్రగ్స్ కొనలేదు, అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు అని ఆమె అన్నారు . అయితే ఇంతదాకా వచ్చిన తర్వాత అతను మళ్ళీ కలుస్తాడా అని అడిగితే ఇంత ఇష్యూ అయిన తర్వాత డామేజ్ నాకు జరిగిందా? రాజ్ తరుణ్ కు జరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. శేఖర్ బాషా వలన నా క్యారెక్టర్ కి బ్యాడ్ జరిగింది, డ్యామేజ్ జరిగింది నాకు. ఈ డ్యామేజ్ జరిగింది కదా అని బంధాన్ని వదులుకోవాలంటే ఎన్ని బంధాలు నిలవ గలవు అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు రాజ్ తరుణ్, తాను కలిసి డ్రగ్స్ తీసుకున్నామని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

Lavanya : హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నా రాజ్ అంటే ప్రాణం.. లావణ్య సంచలనం

అదేంటి నిజంగానే రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడా అంటే నేను డ్రగ్స్ తీసుకున్నానని రాజ్ తరుణ్ అంటే కనుక మేమిద్దరం కలిసి తీసుకున్నట్లే అని ఆమె అన్నారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అసలు మేము చేయలేదు. దానికి సంబంధించి ఆధారాలు కూడా లేవని ఆమె అన్నారు. మీరు గర్భం దాల్చినట్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అబార్షన్ చేయించారని చెప్పారు ఇందులో వాస్తవం ఉందంటారా? నిజంగానే అప్పుడు గర్భం దాల్చి ఉంటే ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నిస్తే సంసారం చేస్తుంటే గర్భం ఎందుకు రాదు వచ్చింది. అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము. ఒకసారి మిస్ క్యారీ అయింది. అప్పటికి ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇల్లు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతోనే రాజ్ తరుణ్ ప్రమేయంతోనే అబార్షన్ జరిగింది అని ఆమె అన్నారు.

అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు తెలుసా అని అడిగితే ఈ విషయం మా రెండు కుటుంబాలకు తెలుసని లావణ్య అన్నారు.. అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మీరు ఎవరో తెలుసు మీతో సహజీవనం సంగతి తెలియదు అంటున్నారు అని అడిగితే మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని యాంకర్ ని పేర్కొన్న లావణ్య ఈరోజు కోర్టే చెప్పింది కదా మేం కలిసున్నామని దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు అలా చెబుతున్నారంటే వాళ్ళనే అడగండని అన్నారు. వాళ్లకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దయచేసి పోలీసులతో మాట్లాడమని చెప్పండి నేను పోలీసులతో మాట్లాడాను వాళ్లకి సాక్షాధారాలు ప్రొవైడ్ చేశాను అని ఆమె అన్నారు. లివింగ్ రిలేషన్ లో మేము ఉన్నట్టు తెలియకపోతే వాళ్లు త్వరగా పిల్లలు కనాలని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అంటూ ఆమె ఒక వీడియో కూడా ప్లే చేసి చూపించారు.

Show comments