Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మళ్లీ ముదురుతోంది. మొన్న లావణ్య తనపై రాజ్ పేరెంట్స్ దాడి చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై రాజ్ తరుణ్, శేఖర్ భాషా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రాజ్ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. 15 మంది వచ్చి నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. నేను ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. నిన్న సాయంత్రం కూడా నా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు’ అంటూ తెలిపింది.
Read Also : Shocking: ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి.. పెళ్లికి 2 రోజుల ముందు కోమాలోకి..
‘ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయంత బతుకుతున్నా. వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. నేను చనిపోయాక వారిని అరెస్ట్ చేస్తారా. రాజ్ తరుణ్, నేను కలిసి గతంలో ఓ వ్యక్తి వద్ద రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. ఇద్దరికీ గొడవలు అయిన తర్వాత రెండేళ్ల నుంచి ఆ అప్పు కట్టట్లేదు. ఇప్పుడు వాళ్లు ఫోన్ చేసి అప్పు కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. రాజ్ తరుణ్ ఆ అప్పు కట్టినా సరే ఇంటిని మాత్రం అతనికి దక్కనివ్వను. రాజ్ తరుణ్, శేఖర్ భాషా నా మీద కుట్రలు చేస్తున్నారు. వారి నుంచి నన్ను కాపాడాలని కోరుకుంటున్నా. ఆడపిల్లలను అయిన నా మీద ఎందుకింత కక్ష కడుతున్నారో అర్థం కావట్లేదు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.
