‘సర్కారువారి పాట’ మ్యానియా మొదలైపోయింది.. ఎక్కడ చూసినా మహేష్.. మహేష్ అన్న అరుపులతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. బాబు కటౌట్ లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డుల వేట మొదలుపెట్టింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించేసింది.
మహేష్ ఫ్యాన్స్ ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం సర్కారు వారి మ్యానియా యూఎస్ లో రచ్చ రేపుతోంది. భారీ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 8 లక్షల 25 వేల డాలర్స్ ఒక్క ప్రీమియర్స్ ద్వారానే సాధించింది. ఈ విషయాన్నీ మేకర్స్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే సర్కారువారు రికార్డుల వేట మొదలుపెట్టారు.. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.
🕺🏻💃🏻#SVPMania https://t.co/BFggCg7Msc
— Mythri Movie Makers (@MythriOfficial) May 12, 2022
