Site icon NTV Telugu

Virata Parvam: ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చరణ్ మిస్.. ఎందుకంటే..?

Ram Charan Lokesh Film Update

Ram Charan Lokesh Film Update

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు వెంకటేష్, రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారని ప్రకటించారు. అయితే ఇప్పటికే వెంకటేష్ వేడుకకు చేరుకోగా రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు మిస్ అయ్యాడు. ప్రస్తుతం చరణ్ వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఇక భారీ వర్షాల కారణంగా ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఆయన ఈ వేడుకకు రావడం లేదని రానా వేదికపై చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు కొద్దిగా నిరాశకు గురవుతున్నారు.

Exit mobile version