సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారువారి పాట”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. గత కొన్ని రోజులుగా చివరి దశలో ఉన్న షూటింగ్ ను ఎట్టకేలకు ఫినిష్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. షూటింగ్ పూర్తి.. ఇక అప్డేట్స్ వచ్చేస్తాయి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ అప్డేట్ తో పాటు మహేష్ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో మహేష్ అదిరిపోయాడు.
రెండు చేతుల్లో తాళాల గుత్తులు పట్టుకొని, వయలెంట్ లుక్ తో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ వడ్డీ రికవరీ చేసే ఏజెంట్ గా కనిపించనున్నాడని టాక్.. ఎంతటి ధనవంతులైన వడ్డీ కట్టకపోతే వారి మెడలు వంచి మరీ మహేష్ రికవరీ చేస్తాడట.. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ల మెడలు వంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Shoot Done & Dusted 🤘
All Set for the Box Office Recovery From MAY 12th 💥💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/UOVMq4Pqlc
— Mythri Movie Makers (@MythriOfficial) April 22, 2022
