HITMAN Chapter 1 First Look, Teaser Unveiled: బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు స్వీయ దర్శకత్వంలో 99 సినిమాస్ బ్యానర్‌పై దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’ నవంబర్‌లో రిలీజ్ కానుంది. రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగ ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ టీజర్ పరిశీలిస్తే గాయాల పాలైన హీరో అద్దంలో తనని తాను చూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ దేని గురించో బాధపడుతుంటాడు. కానీ దాన్ని బయటకు కనిపించకుండా స్టైలిష్ గా తయారై తన గదిలోకి వెళతాడు. అక్కడున్న అనేక అత్యాధునిక ఆయుధాల్లో విల్లుని ఎంపిక చేసుకుని వెనక్కి చూసి విల్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని గురి పెట్టి ఛేదించడం కనిపిస్తోంది. అయితే అసలు ఈ హిట్ మ్యాన్ తన లక్ష్యం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే నవంబర్‌లో విడుదల కాబోతున్న ‘హిట్ మ్యాన్’ సినిమా చూడాల్సిందేనని మేకర్స్ అంటున్నారు.
Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణదానం
హీరో, డైరెక్టర్ బిష్ణు మాట్లాడుతూ ‘‘’హిట్ మ్యాన్’ ఒక స్పై థ్రిల్లర్ అని, దీనికి స్క్రిప్ట్ నేనే రాసి డైరెక్ట్ చేయటంతో పాటు హీరోగానూ నటించానని అన్నారు. ఇది ఒక న్యూ ఏజ్ మూవీ అని, బుర్జ్ ఖలీఫాలో సినిమా షూటింగ్ చేశామని అన్నారు. పారిస్, దుబాయ్, ఆమ్స్టర్డ్యామ్, నేపాల్, శ్రీలంక, భారత్ మొత్తం 6 వేర్వేరు దేశాల్లో సినిమా షూట్ చేశామని అన్నారు. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని, అందులో ఛాప్టర్ 1 నవంబర్ లో రిలీజ్ కానుందని అన్నారు. రాంబో సినిమా తర్వాత విల్లు, బాణాలతో కూడిన యాక్షన్ మూవీ మరోటి రాలేదు కానీ ఈ సినిమాలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశామని అన్నారు. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్వీస్ టెక్నాలజీ ఉన్నట్లు ఈ సినిమాలో ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన హిందీలోనూ రిలీజ్ చేయటానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అని వెల్లడించారు.
