Site icon NTV Telugu

Veera Simha Reddy: వాహ్… కటౌట్ అదిరిందయ్యా…

Veera Simha Reddy

Veera Simha Reddy

సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా లాంటి టైటిల్స్ వినగానే నందమూరి అభిమానులకి మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ అభిమానులకి ‘వైట్ అండ్ వైట్ కద్దర్’ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తొస్తాడు. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా’ అని బాలయ్య గొడ్డలి పట్టుకోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పినా, ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ అని నరసింహ నాయుడుగా గర్జించినా, ‘కర్నూల్, చిత్తూర్, కడప… ఏ సెంటర్ అయినా పర్లా చెమట పట్టకుండా’ చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినా నందమూరి అభిమానులు థియేటర్స్ టాప్ లేచిపోయే రేంజులో హంగామా చేసే వాళ్లు. అలా బాలయ్యని ఫ్యాక్షన్ రోల్ లో చూసి థియేటర్స్ లో విజిల్స్ వేసిన డై హార్డ్ ఫాన్స్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకడు. ఎన్నో సంవత్సరాల థియేటర్స్ లో ఒక అభిమానిగా బాలయ్యని థియేటర్స్ లో చూసిన గోపీచంద్ మలినేని, ఇప్పుడు బాలయ్యని డైరెక్ట్ చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ సినిమాని తెరకెక్కించాడు.

ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే వింటేజ్ వైబ్స్ ఇవ్వాలి కదా… తను ఒకప్పుడు తన అభిమాన హీరోని ఎలా చూసాడో మరోసారి అలానే చూపించాలి అనుకుంటాడు కదా. గోపీచంద్ మలినేని కూడా అదే చేస్తున్నాడు. వీర సింహా రెడ్డి ప్రమోషనల్ కంటెంట్ లో భాగంగా బయటకి వస్తున్న పోస్టర్స్ చూస్తుంటే ప్రతి నందమూరి అభిమానికి వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి. ఇటివలే బయటకి వచ్చిన కొత్త పోస్టర్ లో బాలయ్య వైట్ అండ్ వైట్ వేసి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో నటసింహం ఫెరోషియస్ గా ఉన్నాడు. మరి బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని థియేటర్స్ లో వీర సింహా రెడ్డి సినిమాతో  నందమూరి అభిమానులకి సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు రేంజ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version