NTV Telugu Site icon

VD12: రామ్ చరణ్ కు సెట్ కాలేదు విజయ్ కు సెట్ అవుతుందా..?

Charan

Charan

VD12: లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కొద్దిగా జోరు తగ్గించిన విషయం తెల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోకుండా కొద్దిగా అభిమానులను మెప్పించే కథలను ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను ఈ మధ్యనే ప్రకటించాడు విజయ్. ఈ సినిమాలో రౌడీ హీరో పోలీస్ గా కనిపిస్తున్నాడు. అయితే అంతకుముందు ఇదే కథతో గౌతమ్, రామ్ చరణ్ వద్దకు వెళ్లడం, ఆయన కూడా ఓకే చేయడం, అధికారికంగా ప్రకటించడం అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ, అనుకోనివిధంగా రామ్ చరణ్ ఈ కథ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే కథను విజయ్ కు వినిపించి గౌతమ్ ఓకే అనిపించేశాడు.

ఇక అసలు చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఉన్న కథ ఏంటీ..? అని అంటే.. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ చేసిన పాత్రకు లానే ఇందులో కూడా పోలీసాఫీసర్ అవ్వడం కోసం హీరో కష్టపడుతూ ఉంటాడట. అంతకుముందు ఈ పాత్ర నచ్చినా.. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ లో చరణ్ చేసిన రామరాజు పాత్ర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా వెంటనే అలాంటి పాత్రే మరోసారి చేస్తే.. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచించి చరణ్ వెనకడుగు వేశాడట. ఇక చరణ్ ప్లేస్ లో విజయ్ రావడంతో మరోసారి ఈ సినిమాపై అభిమానులకు ఆశలు రేకెత్తాయి. మరి చరణ్ కు సెట్ కానీ ఈ సినిమా విజయ్ కు ఎలా సెట్ అవుతుందో చూడాలి.

Show comments