ఏ రంగమైనా పోటీ అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అయితే మరీ ముఖ్యంగా ఉంటుంది.. ఉండాలి కూడా.. అయితే అది ఆరోగ్యకరమైన పోటీలా ఉండాలి.. టాలీవుడ్ లో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ సినిమాల పరంగా పోటీని ఎదుర్కొన్నా బయట మాత్రం కలివిడిగా ఉంటారు. అది అందరికి తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ ఏమైనా సోషల్ మీడియాలో గొడవలు చేస్తారు కానీ హీరోలు మాత్రం ఒకరి గురించి మరొకరు పల్లెత్తు మాట కూడా అనుకోరు.. ఇక హీరోయిన్ల విషయంలో కూడా అంతే.. ఒకరి స్థానంలో మరొకరు రావడం , ఒకరితో మరొకరు నటించలేము అని చెప్పడం జరుగుతూనే ఉంటుంది. అయితే వాటికి కారణాలు మాత్రం ఏమి ఉన్నా బయటికి మాత్రం ఒక హీరోయిన్ కు మరొక హీరోయిన్ భయపడినట్లు వారి అభిమానులు చెప్పుకు వస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత, మరొక స్టార్ హీరోయిన్ రష్మిక ను చూసి భయపడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.. ఎందుకంటే .. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక వీరిద్దరిని ఇటీవల ఒక పట్టు చీరల కంపెనీ ఒక యాడ్ కోసం ఈ స్టార్ హీరోయిన్లను సంప్రదించారట.. అయితే కారణం తెలియదు కానీ సమంత ఈ యాడ్ ను సున్నితంగా తిరస్కరించిందట.. అయితే ఇలా రిజెక్ట్ చేసినందుకు కాను రష్మిక ఫ్యాన్స్ సామ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రష్మికను చూసి సామ్ భయపడిందని, అందుకే ఈ యాడ్ ను రిజెక్ట్ చేసిందని చెప్పుకొస్తున్నారు. రష్మిక పక్కన సామ్ నటిస్తే ఆమె తక్కువ అని ఫీల్ అవుతుందని, నేషనల్ క్రష్ పక్కన తాను నటిస్తే తన పేరు పోతుందని ట్రోల్ చేస్తున్నారు. అయితే సిల్లీ కాకపోతే ఇలాంటి రూమర్ ఏంటీ ..? సామ్ ఎక్కడ .. రష్మిక ఎక్కడ..? ఇద్దరికీ కంపారిజాన్ ఎందుకు చేస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
