Site icon NTV Telugu

Sai Pallavi: సినిమాలు చేయకపోతే పెళ్లి చేసేస్తారా..?

Sai Pallavi

సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త  అయినా ఇట్టే  వైరల్ గా మారిపోతుంది. ఇక పుకార్లు అయితే ఆశలు ఆగవు. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వ సాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్ గా మారిన విషయం విదితమే. గతేడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటినుంచి ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే మరికొందరు మాత్రం కొత్త పుకార్లు పుట్టించేశారు. సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నదని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని ఆ పుకార్ల సారాంశం. ఇక దీంతో సాయి పల్లవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా , సినిమా కు మధ్య గ్యాప్ వస్తే పెళ్లి చేసేస్తారా ..? ఈ వార్తలు సాయి పల్లవి కుటుంబాన్ని ఎంత భాదిస్తాయో తెలుస్తుందా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అస్సలు సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం.. మంచి కథ ఆమె దగ్గరకు వెళ్లకపోవడమని తెలుస్తోంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప గ్లామర్ కు అవకాశమున్న పాత్రలు అమ్మడు చేయదన్న విషయం విదితమే. అందుకే కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొంటుంది. త్వరలోనే అముఞ్చి కథతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు రానున్నదని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే  ఇప్పుడైన సాయి పల్లవి బయటికి వచ్చి ఈ  పెడితే బావుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version