Prashant Neel: ఉగ్రం సినిమాతో కన్నడ నాట అడుగుపెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే కన్నడలో సంచలనం సృష్టించాడు. ఇక తన రెండో సినిమాగా కెజిఎఫ్ ను స్టార్ట్ చేశాడు. ప్రశాంత్ లో ఉన్న ట్యాలెంట్ ను మెచ్చి తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ట్యాలెంట్ ఉన్నవారు ఎక్కడి నుంచి వచ్చారు..? వారిది ఏ భాష అనేది చుడనివారు తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ నచ్చితే వారిని అందలంపై కుర్చోపెడతారు. కెజిఎఫ్ తో కన్నడ హీరో యష్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేశారు. ప్రశాంత్ నీల్ కన్నడ రాజమౌళి అని తేల్చేశారు. ఇక కెజిఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ కు గుడికట్టినా తప్పులేదురా అన్నట్లు ప్రశంసించారు.
ఇక ఇన్ని ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ నీల్ మన సీమ బిడ్డనే అని తెలుసుకున్న తెలుగువారి ఆనందానికి అవధాలు లేకుండా పోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ప్రశాంత్ నీల్ అచ్చ తెలుగు రాయలసీమ బిడ్డ. అనంతపురంలోని ఒక మారుమూల గ్రామమైన నీలకంఠాపురం లో జన్మించాడు. ఇప్పటికి ఆయన బంధువులు అక్కడే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే.. మాజీ మంత్రి..కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి, ప్రశాంత్ కు స్వయానా బాబాయ్ అవుతారు. ఈ విషయం నిన్నే అందరికి తెల్సింది. నిన్న ప్రశాంత్ నీల్ తన స్వంత గ్రామంలో హల్చల్ చేశారు. తమ బంధువులను, స్నేహితులను కలుసుకున్నారు. ఇదే మా స్వంత గ్రామమమని, తన పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠ అని చెప్పుకొచ్చారు. దీంతో ప్రశాంత్ తెలుగువాడు అని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్, ప్రభాస్ తో సలార్, ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తున్నాడు.