NTV Telugu Site icon

Project K: ఓరి బాబో ఆపండ్రా .. ఇక్కడ ఒక్కటే అవ్వలేదు అప్పుడే రెండోదా..?

Project K

Project K

Project K: చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ట్రెండ్ వైరల్ గా మారింది అంటే.. మిగతావాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇక తెలుగులో బాహుబలి సినిమా ద్వారా జక్కన్న సీక్వెల్స్ అంటే ట్రెండ్ ను మొదలుపెట్టాడు.. ముందు నుంచి ఈ ట్రెండ్ ఉన్నా కానీ, బాహుబలి నుంచి బాగా వైరల్ గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న సినిమాలన్ని రెండు భాగాలుగానే వస్తున్నాయి. పుష్ప, బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్.. ఇప్పటికే ఈ సినిమాల మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకున్నాయి. వీటి రెండో పార్టీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Vijay Antony: ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు బ్రో

ఇక ఈ ట్రెండ్ కొనసాగుతుండడంతో ఇప్పుడు వచ్చే పాన్ ఇండియా సినిమాలు కూడా రెండు పార్టులు వస్తున్నాయంటూ రూమర్స్ మొదలయ్యాయి. మొన్నటివరకు ఆదిపురుష్ రెండు భాగాలు వస్తుందని వార్తలు వచ్చాయి.. అది నిజం కాదని తెలియడంతో కొద్దిగా చల్లబడ్డారు.. ఇక నిన్నటికి నిన్న నాని దసరా మూవీ రెండు పార్టులుగా విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్తపై స్పందించిన నాని.. దసరా ఒకటే అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అవి కూడా నీరుగారిపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ మీదనే పడ్డారు రూమర్ క్రియేట్ చేసేవాళ్ళు. ప్రభాస్- నాగ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కె టూ పార్ట్స్ గా రిలీజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో కూడా నిజం లేదని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ వార్త విన్న అభిమానులు.. ఓరి బాబో.. ఇక్కడ ఒకటే అవలేదు.. అప్పుడే రెండోది ఏంటి రా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments