Site icon NTV Telugu

Pawan Kalyan: హఠాత్తుగా అమెరికా కు పవన్.. అందుకేనా..?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడిన విషయం విదితమే. ఈసారి ఎన్నికల్లో పవన్ గెలవాలని ఎంతో శ్రమిస్తున్నాడు. ఏపీ మొత్తం ఎన్నికల ప్రచారం చేయాలనీ బస్సు యాత్ర ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాల వలన అది వాయిదా పడింది. ఇక మరోపక్క పవన్ అంగీకరించిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారాయి. అయితే ఈ బస్సు యాత్ర వాయిదా పడడంతో కొద్దిగా సమయం దొరికిందని, ఆ సమయంలో హరిహర వీరమల్లు సినిమాను ఫినిష్ చేస్తాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ హఠాత్తుగా అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కొంతమంది ప్రముఖులను కలవాల్సి ఉండగా.. దానికోసం పవన్ హుటాహుటిన అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల వరకు పవన్ అమెరికాలోనే ఉండనున్నట్లు సమాచారం.

ఇక ఆ పని పూర్తి అయిన తరువాత సెట్ లో అడుగుపెట్టనున్నారట. బస్సు యాత్ర డేట్ కన్ఫర్మ్ అయ్యేవరకు ఆయన సినిమాలతోనే బిజీగా ఉండనున్నారట. ఇకపోతే ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు చివరి దశలో ఉండగా.. భవదీయుడు భగత్ సింగ్,వినోదాయ సీతాం సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఇక ఏవి కాకుండా లైన్లో సురేందర్ రెడ్డి సినిమా ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే పవన్ వారికి టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకదాని తరువాత ఒకటి గ్యాప్ లేకుండా పవన్ షూటింగ్స్ లో పాల్గొననున్నాడట. ఇక ఇలా గ్యాప్ లేకుండా చేస్తే ఆయన ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశాలు ఉన్నాయని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి పవన్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.

Exit mobile version