NTV Telugu Site icon

Lavanya Tripathi: మెగా కోడలికి జోడీగా బిగ్ బాస్ విన్నర్.. బ్రేక్ లేకుండా షూట్?

లావణ్య

లావణ్య

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆమె వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇక ప్రస్తుతం వరుణ్ కుటుంబం మొత్తం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండగా.. లావణ్య షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక వెబ్ సిరీస్.. మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి జీ5లో స్ట్రీమింగ్ అయిన పులి మేక అనే వెబ్ సిరీస్ ద్వారా లావణ్య డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. దీని తరువాత లావణ్య స్కైలాబ్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన విశ్వ‌క్ ఖండేరావు తో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అయ్యింది.

Bigg Boss Telugu 7: మొదటి ఎలిమినేషన్ లోనే హాట్ బ్యూటీ అవుట్.. ?

లావణ్య ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయనుందని అంటున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా క్రియేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిరీస్ లో లావణ్యా త్రిపాఠికి జోడీగా ‘బిగ్ బాస్’ విన్నర్, శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఓ హీరోగా నటించిన అభిజిత్ నటించడమే. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సిరీస్ షూట్ కూడా శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ కామెడీ జానర్ గా లావణ్య త్రిపాఠి, అభిజిత్ ల ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయనున్న క్రమంలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సిరీస్ త్వరగా ఫినిష్ చేయాలని షూటింగ్ బ్రేకులు పడకుండా శరవేగంగా చేసేస్తున్నారు.

Show comments