Site icon NTV Telugu

Keerthy Suresh: ‘మహానటి’ గట్టెక్కేది ఎప్పుడో..?

మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె ఫేస్ కళతప్పిదని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు. బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి బావుందని, సన్నగా మారాక ఆమె ఫేస్ అంత లోపలి వెళ్ళిపోయి హావభావాలు పలికించినా కనిపించడం లేదని అంటున్నారు. ఈ ట్రోలింగ్ ఎక్కడివరకు వచ్చిందంటే.. సర్కారు వారి పాట లో కళావతి పాటను కూడా ట్రోల్ చేయడం మానలేదు.

ఛార్మింగ్ మహేష్ పక్కన కళావతి కళ లేకుండా ఉన్నదని, ఫేస్ లో గ్లోనెస్ తగ్గడం సహా ఎక్స్ ప్రెషన్స్ పరంగాను వీక్ గా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం కీర్తి ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకొంది. మహానటి తరవాత ముద్దుగుమ్మకు మచ్చుకు కూడా ఒక విజయం దక్కలేదు. అలాంటి సమయంలోనూ మహేష్ సరసన ఛాన్స్ పట్టేయడంతో అమ్మడి లక్ ఇంకా ఉందని అర్ధమవుతుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కీర్తి కిపేరు వస్తే తప్ప ఆమె మీద ఉన్న నెగెటివ్ మార్క్ పోదు., ఈ సినిమా హిట్ పైనే కీర్తి సురేష్ కెరీర్ ఆధారపడుతుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక మరోపక్క చిరుకు చెల్లెలిగా బోళా శంకర్ లో కీర్తి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో సైతం అమ్మడికి మంచి పాత్రే దక్కింది. మరి ఈ సినిమాలతో కీర్తి గట్టెక్కుతుందా..? మళ్లీ ఫార్మ్ లోకి వస్తుందా..? అనేది చూడాలి.

Exit mobile version