టాలీవుడ్ లో సీక్వెల్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఒక వేళ వచ్చినా ఒక్క హీరో తప్ప మిగిలిన వారందరు కొత్తవాళ్లు ఉంటారు.. కథ మొత్తం మారిపోతుంది. ఒక్క సీక్వెల్ అన్న పేరు తప్ప పార్ట్ 1 కు పార్ట్ 2 కు సంబంధమే ఉండదు. అయితే ఇలాంటివేమి ‘ఎఫ్ 3’ కి వర్తించవు అంటున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ‘ఎఫ్ 2’ ను తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి లేటెస్ట్ జంధ్యాల అనిపించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కించిన విషయం విదితమే. మే 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక మే 9 న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ ట్రైలర్ కు డబ్బింగ్ పనుల్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే పూర్తిచేయగా.. తాజాగా వెంకీ కూడా డబ్బింగ్ ను పూర్తిచేసాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అదేంటంటే.. ‘ఎఫ్ 3’ కి సీక్వెల్ గా ‘ఎఫ్ 4’ కూడా రాబోతున్నదంట. అనీల్ రావిపూడి `ఎఫ్-3` పై నమ్మకంతోనే `ఎఫ్-4`ని కూడా రెడీ చేస్తున్నట్లు గుసగుస వినిపిస్తుంది. మొదటి భాగంలో భార్యల గోల చూపించిన అనీల్.. రెండో భాగంలో డబ్బు కష్టాలు చూపించన్న విషయం విదితమే. ఇక ఈ రెండిటికి మరో ఎఫ్ ను జోడించి కొత్తకథను రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథ పూర్తిగా ‘ఎఫ్ 3’ విజయంపైనే ఆధారపడి ఉందని టాక్. ఈ సినిమా కనుక విజయ డంకా మోగిస్తే ‘ఎఫ్ 4’ ను వెంటనే పట్టాలెక్కిస్తాడంట అనీల్.. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే కొంచెం గ్యాప్ తీసుకొని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ‘ఎఫ్3’ రిలీజ్ కాకముందే ‘ఎఫ్4’ గురించి ఇంతలా టాక్ రావడం అంటే మాటలు కాదు. మరి చూడాలి ఈ విషయమై అనీల్ క్లారిటీ ఏమైనా ఇస్తాడేమో..
