Curry & Cyanide: ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఒక ఆడదాని వలనే చరిత్రలో ఎన్నో యుద్దాలు జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా ఒక ఆడదాని గురించే. జీవితంలో లగ్జరీగా బతకాలన్న ఆశతో ఒక కుటుంబాన్నే నాశనం చేసిన ఆడదాన్ని గురించి.. కట్టుకున్న భర్తను, అత్తమామలను దారుణంగా చంపినా కూడా పశ్చాతాపడని ఒక కసాయి గురించి.. ఆమె ఎవరో ఈపాటికి మీ అందరికి తెలిసే ఉంటుంది. అధికారం కోసం అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్ ను.. పెళ్ళికి అడ్డుగా ఉన్నారని స్నేహితురాలిని, ఆమె కూతురును సైనైడ్ ఇచ్చి చంపిన జాలీ అలియాస్ జాలీ జోసెఫ్. కేరళలోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్ కేసు 2022 లో వెలుగు చూసింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఆరుగురిని హత్యచేసి తప్పించుకొని తిరిగింది. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత జాలీ ఆడపడుచు చేసిన దైర్యం వలన ఆమె దారుణాలు బయటపడ్డాయి.
ఇక ఈ రియల్ క్రైమ్ ను ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించడం జరిగింది. అదే.. కర్రీ అండ్ సైనైడ్. నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఆడది ఇంత పకడ్బందీగా ఇంత పెద్ద క్రైమ్ చేస్తుందని ఎవరు ఉహించి ఉండరు. నేషనల్ అవార్డు విన్నర్ క్రిస్టో టామీ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు. జాలీ కుటుంబ సభ్యులే ఈ కథను చెప్పుకొచ్చారు. ఎంత పక్కా ప్లాన్ తో జాలీ తమ కుటుంబాన్ని నాశనం చేసిందో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో డాక్యుమెంటరీలను చూడాలని ఎవరు అనుకోరు. కానీ, జాలీ డాక్యుమెంటరీని మాత్రం ఎంతో ఆసక్తితో చూసారు. అందుకే నెట్ ఫ్లిక్స్ లో కర్రీ అండ్ సైనైడ్ టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇండియాలో మాత్రమే కాదు. ప్రపంచంలోని 30 దేశాల్లో కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. మరి ముందు ముందు ఈ డాక్యుమెంటరీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
