Site icon NTV Telugu

Salman Khan: స్టార్ హీరో తమ్ముడి విడాకులు.. ఆ స్టార్ హీరోయినే కారణమట..?

Huma Khureshi

Huma Khureshi

ప్రస్తుతం బాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తోంది. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్న జంటలు.. అంతే ఇష్టంతో విడిపోవడం ట్రెండ్ గా మారింది. మేము ఇద్దరం ప్రేమికులుగా ఒక్కటయ్యాం.. స్నేహితులుగా విడిపోతున్నాం అంటూ అధికారికంగా చెప్పి మరీ విడిపోతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా విడిపోయాకా కూడా తమ తమ కొత్త ప్రేమికులతో పార్టీలు చేసుకోవడం అనేది బాలీవుడ్ సెలబ్రిటీలకే చెల్లింది. ఇప్పటికే చాలామంది స్టార్లు తమ భార్యలకు విడాకులు ఇవ్వడానికి కారణం మరో హీరోయిన్ అంటూ వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. తాజాగా మరో స్టార్ హీరో తమ్ముడి విడాకులకు కారణం కూడా ఒక హీరోయిన్ అని వార్తలు గుప్పుమంటున్నాయి.. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

సల్మాన్ చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్, తన భార్య సీమా ఖాన్ నుంచి విడిపోతున్నట్లు బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 24 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ నిర్ణయం వెనుక స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ తో, సోహైల్ ఖాన్ రిలేషనే ఐ బీ టౌన్ లో టాక్ నడుస్తోంది. వీరిద్దరి బంధం గురించి గతంలో చాలాసార్లు వార్తలు వినిపించాయి. ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కూడా నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఆ వార్తలను కొట్టేసిన హ్యూమా .. సోహైల్ తనకు అన్నలాంటివాడు అని చెప్పి అందరి నోళ్లు మూయించింది. ఇక ఈ జంట విడిపోతున్నారు అని తెలిసేసరికి మరోసారి హ్యూమా రిలేషన్ వార్తల్లోకి వచ్చింది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version