NTV Telugu Site icon

Puri Jagannath: ‘లైగర్’ ప్లాప్.. పూరీ పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

Puri

Puri

Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు మధ్యలో కొన్ని ప్లాపులను చవిచూశాడు. ఇక తాజాగా లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో పూరీ రేంజ్ తల్లకిందులయ్యింది. డబ్బు విషయం పక్కన పెడితే ఆయన ఇమేజ్ పోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. లైగర్ సినిమా నష్టాలు చవి చూసినా శాటిలైట్ హక్కులు భారీగానే రావడంతో పూరీ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఈ ప్లాప్ పూరీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. పూరీ డైరెక్షన్ లో చేయాలంటే రాసిపెట్టి ఉండాలి అని అనుకొనేవారట అప్పట్లో హీరోలు. కానీ ఇప్పుడు ఈ సినిమా దెబ్బతో వామ్మో పూరీతో సినిమానా ..? మాకొద్దు అంటున్నారట. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ- పూరీ కాంబోలో వస్తున్న జనగణమణ కూడా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాతలు ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని టాక్. ఇక ఈ సినిమా కాకుండా నెక్స్ట్ పూరీ ప్లాన్ ఏంటి..? ఒక చిన్న కథతో నార్మల్ సినిమాను తీయాలన్నా హీరోలు ముందుకు రావడం లేదట. ఇలాంటి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పూరీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఏ హీరో డాషింగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు? అనేది అందరి మైండ్ లో ఉన్న ప్రశ్నే.. స్టార్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా పూరీ సినిమా అంటే జంకుతున్నారట. మరీ ఇంత దారుణమైన పరిస్థితి పూరీకి ఎన్నడూ రాలేదేమో అంటున్నారు. మరి చూడాలి పూరీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటాడో..