NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పనిలో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అధికారికంగా సినిమా ప్రకటించినప్పటికీ దీనిగురించి వార్త ఒక్కటి కూడా బయటకు రాలేదు. అయితే ఉప్పెన తో మొదటి సినిమాతోనే హాట్ అందుకున్న బుచ్చిబాబు రెండో సీనియామనే ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేశాకే వేరే ఏదైనా సినిమా మొదలుపెడతానని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడు బుచ్చిబాబు. ఇక ఇటీవలే ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా గురించి మాట్లాడాడు.
సినిమా స్టోరీ మీద కొంత హింట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒకరు కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాడట, ఇంకొక ఎన్టీఆర్ 65 ఏళ్ళ వ్యక్తిగా వీల్ చైర్ లో ఒక కాలు పోగొట్టుకొని కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింటి వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సినిమా తీస్తే తీసావ్ కానీ, ఏదైనా తేడా జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉగ్ర రూపం చూస్తావని కొందరు.. ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కట్ చేయకుండా ఉండలేవా అన్నా.. నువ్వు అని మరికొందరు ఆడేసుకుంటున్నాడు. ఇక ఇంకొందరు అసలు ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందో చెప్పండ్రా బాబు అని అడుగుతున్నారు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా మొదలయ్యేవరకు వేచి ఉండక తప్పదు.
