NTV Telugu Site icon

Lal Salaam OTT: రెండు ఓటీటీల్లోకి రజినీకాంత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Lal Salaam

Lal Salaam

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ తర్వాత లాల్ సలామ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.. భారీ అంచనాల నడుమ గత నెల 9 నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. వసూళ్ల పరంగానూ లాల్ సలామ్ నిర్మాతలకు నిరాశే మిగిలింది.

థియేటర్లలో పెద్దగా మెప్పించలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.. రజనీకాంత్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెండు ఓటీటీలలో ఒకే రోజు లాల్ సలామ్ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో రజనీకాంత్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే సన్ నెక్స్ట్‌లో కేవలం తమిళ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రానుంది..

మార్చి 9 న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది.. ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. లివింగ్ స్టన్, సెంతిల్, తంబి రామయ్య, నిరోషా, వివేక్ ప్రసన్నా, ధన్యా బాలకృష్ణ, తంగదురై తదితరులు నటించారు.. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు..

Show comments