Site icon NTV Telugu

‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అతిథులు వీరే!

Lakshya

Lakshya

యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఫుల్ మేకోవర్ తో విలుకాడిగా నాగశౌర్య నటిస్తున్న ఈ మూవీ ఇదే నెల 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగబోతోంది. డిసెంబర్ 5వ తేదీ జరగబోతున్న ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అలానే యంగ్ హీరో శర్వానంద్ తో పాటు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వేడుకలో అతిథిగా పాల్గొనబోతున్నారు.

Read Also : “అడవి తల్లి మాట”… ‘భీమ్లా నాయక్’ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్

విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో ‘లక్ష్య’లో కనిపించబోతున్నాడు. అంతే కాదు ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్‌తో నాగ శౌర్య అలరించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాకు కాలభైరవ సంగీతం సమకూర్చాడు. జగపతిబాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version