Site icon NTV Telugu

‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’గా లక్ష్ చదలవాడ

‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి.

గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు ఫ‌స్ట్‌లుక్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా చూస్తున్న ప‌హిల్వాన్స్‌.. వారి మ‌ధ్య‌లో కూల్‌గా… స్టైల్‌గా కొబ్బ‌రి బొండం తాగుతూ కూర్చున్న హీరో ల‌క్ష్ క‌నిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ల‌క్ష్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయినట్టు తెలుస్తోంది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి గీతాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. లక్ష్ చదలవాడ సరసన వేదిక దత్త నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చరణ్‌ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version