Laksh: రెండు భాషల్లో వస్తానంటున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్య ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాల్లో నటిస్తున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పి. సి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. వీటికి చక్కని స్పందన లభించింది. అలానే లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించాయి. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే అవుట్ పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా, బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుతున్నారు మేకర్స్. ఈ వర్క్స్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో మూవీ రిలీజ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24న ఈ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో ఎన్నడూచూడని ఆసక్తికర కథతో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీ రూపొందిస్తున్నామని, ప్రేక్షకులు థ్రిల్ అయ్యే పలు అంశాలు ఈ సినిమాలో ఉంటాయని, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. వేదిక దత్త, ‘వెన్నెల’ కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ, నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలు సమకూర్చుతున్నాడు.
Also Read
- Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
- Karuppu : కరుప్పు హిట్.. కీ టెక్నీషియన్స్'కి కార్లు కొనిపెట్టిన సూర్య
- Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
- Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
తాజావార్తలు
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
-
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
-
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!