Site icon NTV Telugu

లక్ష్ చదలవాడ హీరోగా కొత్త చిత్రం!

Laksh

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను చేరువైన ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నలక్ష్ చదలవాడ తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు.

Read Also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథ తో తెరకెక్కుతున్న ఈ వినూత్నమైన సినిమా తొందరలోనే షూటింగ్ కు వెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 12 గా చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి.

Exit mobile version