Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagaan Re Release Date : సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భారతీయ సినిమా చరిత్రలో అలాంటి అరుదైన క్లాసిక్‌ల జాబితాలో ముందువరుసలో నిలిచే చిత్రం ‘లగాన్’. విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్నా ఈ సినిమా ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు ఈ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామా తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక తరం థియేటర్లలో ఆస్వాదించిన ఈ అద్భుతాన్ని, కొత్త తరం కూడా వెండితెరపై చూసే అవకాశం దక్కబోతోంది.
2001లో విడుదలైన ‘లగాన్’ అప్పటి బాలీవుడ్లో ఒక సంచలనం సృష్టించింది. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, బ్రిటిష్ పాలన నేపథ్యంలో క్రికెట్‌ను మైన్ పాయింట్ గా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం మొదట్లో చాలామందికి సాహసోపేత ప్రయత్నంలా కనిపించింది. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు ఇది మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
Also Read
దర్శకుడు అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశంలో బ్రిటిష్ పాలన, క్రీడలు, దేశభక్తిని అద్భుతంగా మేళవించింది. గ్రామస్థులపై విధించిన భారమైన పన్ను నుంచి విముక్తి పొందేందుకు క్రికెట్ మ్యాచ్ ఆడే సవాల్‌ను స్వీకరించిన భువన్ పాత్రలో ఆమిర్ ఖాన్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయనతో పాటు గ్రేసీ సింగ్, పాల్ బ్లాక్‌థార్న్, రాచెల్ షెల్లీ, రఘుబీర్ యాదవ్, రాజేష్ వివేక్ తదితరులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.
ఈ సినిమా విజయానికి మరో ప్రధాన బలం సంగీతం. సంగీత దిగ్గజం A. R. Rahman అందించిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాలకు చేరవేసిన ఆ సంగీతం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై మరింత బలంగా నిలబెట్టిన చిత్రంగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అకాడమీ అవార్డు నామినేషన్ దక్కించుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. పాత అభిమానులకు ఇది మరోసారి ఆస్వాదించే అవకాశం కాగా, కొత్త తరం ప్రేక్షకులకు భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన కథను పెద్ద తెరపై చూసే అరుదైన అవకాశం. పాతికేళ్లు గడిచినా ‘లగాన్’ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఈ రీ రిలీజ్ మరోసారి నిరూపించబోతోంది.
- Tags
- Aamir Khan
- lagaan
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!