Site icon NTV Telugu

L2 Empuraan : L2 ఎంపురాన్ భారీ రికార్డు.. నాలుగు రోజుల్లోనే..

L2 Empuran

L2 Empuran

L2 Empuraan : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా.. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిందని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ మళయాల సినిమా కూడా ఇంత తక్కువ టైమ్ లో రూ.200 కోట్లు గ్రాస్ చేయలేదని తెలిపింది. ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతోంది. పైగా వీకెండ్ కు తోడు హాలిడేస్ రావడంతో మూవీకి కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ మూవీపై వివాదం ఓ వైపు నడుస్తూనే ఉంది.

Read Also : Pradeep : పవన్ కల్యాణ్‌ టైటిల్ కాబట్టి ఆ భయం ఉంది : ప్రదీప్

సినిమాలో ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు తమిళనాడులోని ఓ రిజర్వాయర్ సీన్ ను తీసేయాలంటూ తమిళనాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ధర్నాలకు కూడా దిగుతున్నారు. వివాదాలపై మోహన్ లాల్, పృథ్వీరాజ్ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ వివాదాలు మాత్రం ఆగట్లేదు. వివాదాల నడుమనే మూవీకి కలెక్షన్లు పెరుగుతుండటం విశేషం. ఇప్పటి వరకు మంజుమ్మల్ బాయ్స్ సినిమా పేరిట ఉన్న రూ.200 కోట్ల రికార్డును ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే లేపేసింది. మూవీకి కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version