Kylie Jenner: అందగత్తెకు ప్లాస్టిక్ అతుకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kylie Jenner: అమెరికాలో మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమన్ కైలీ జెన్నర్ గురించి తెలియని వారుండరు. మురిపాలతో మురిపించే పాతికేళ్ళ ఈ ముద్దుగుమ్మపై యువత దృష్టి సారిస్తూనే ఉంటారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో గత ఐదేళ్ళ నుండి రిలేషన్ షిప్ లో ఉంది కైలీ. అమ్మడు ముఖంలో కొట్టిచ్చినట్టు మార్పు కనిపించడంతో ఏమయిందో అంటూ అబ్బాయిలు ఆరాతీయడం మొదలెట్టారు. చివరకు తన కింది పెదవి సరిగా లేనందున సర్జరీ చేయించుకున్నానని కైలీ చెప్పింది. అందులో విశేషమేముంది అంటారా? అది కాదు అసలు సంగతి, అమ్మడు హాలీవుడ్ నటుడు తిమోతీ కెలమేట్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. అదన్న మాట అసలు విషయం. తిరిగితే మనకేంటి అంటారా? ఆల్రెడీ ర్యాపర్ స్కాట్ తో సహజీవనం చేస్తోన్న అమ్మడు అతనికి బ్రేకప్ చెప్పకుండానే తిమోతీతో ప్రేమయాత్రలు చేయడం తప్పే అంటున్నారు అమ్మడి అభిమానులు.
కైలీ జెన్నర్ మీడియా పర్సన్ కాబట్టి, ఎప్పుడూ వార్తల్లో ఎలా ఉండాలో ఆమెకు బాగా తెలుసు. కేవలం పాతికేళ్ళ వయసున్న కైలీ అందం కోరుకొనే ముద్దుగుమ్మల బలహీనతను అడ్డు పెట్టుకొని పలు సౌందర్య సాధనాలు అమ్మేస్తూ వ్యాపారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది అమ్మాయిలకు కైలీ రోల్ మోడల్ గా నిలచింది. కైలీ పంథాలో పయనించాలని ఆశించే పదహారేళ్ళ పడచు అమ్మాయిలు అమెరికాలో బోలెడు మంది ఉన్నారని చెప్పొచ్చు. వారందరూ కైలీ, తిమోతీతో కలసి తిరగడం తప్పేమీ కాదంటున్నారు. ఎటొచ్చీ కైలీని అభిమానించే అబ్బాయిలే ఏదోరకంగా భావిస్తున్నారు. ఇక అందం కోసం కైలీ పలు సర్జరీలు చేయించుకుందనీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు బిడ్డల తల్లి అయిన కైలీ తన ఫీచర్స్ ను తన కూతురు, కొడుకులో చూసుకుంటున్నానని, ఒకవేళ సర్జరీ కారణంగా తన ముఖంలో మార్పులు చోటు చేసుకున్నా, తన పిల్లల్లో అసలైన రూపు చూసుకోగలననీ కైలీ అంటోంది. అందానికి అతుకులు వేసుకుంటున్న ఈ అమ్మడు, తిమోతీతో ప్రేమాయణం గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. అరె… అన్నట్టు కైలీ పెదవికి సర్జరీ జరిగింది కదా… అది బాగయిన తరువాత చెబుతుందేమో!
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!