Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kv Reddy Birth Anniversary Special Story

KV Reddy: తెలుగు సినిమా ఠీవి.. కేవీ రెడ్డి!

Published Date :July 1, 2022 , 6:00 am
By Subbarao N
KV Reddy: తెలుగు సినిమా ఠీవి.. కేవీ రెడ్డి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలతో తెలుగు సినిమా పలు రికార్డులు నమోదు చేసుకుంది. ఈ నాటికీ కేవీ రెడ్డి బాణీని అధ్యయనం చేస్తూ దర్శకత్వ శాఖలో అడుగు పెట్టేవారు ఎందరో ఉన్నారు.

కే.వి.రెడ్డి 1912 జూలై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం సాగింది. మూలా నారాయణ స్వామి, కేవీ రెడ్డికి మంచి మిత్రుడు. తరువాత కేవీ రెడ్డి మేనమామల ప్రోత్సాహంతో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్ లో మెట్రిక్, డిగ్రీ చదివారు. మిత్రుడు మూలా నారాయణ స్వామి ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. వాహినీ సంస్థ నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ ఇన్ ఛార్జిగా పనిచేశారు. అదే సమయంలో చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన అలవరచుకున్నారు. కేవీ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ వాహినీ సంస్థ ‘భక్త పోతన’ నిర్మించింది. ఈ సినిమా ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.

తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో జానపదాలకు కొత్త బాణీ పలికించారు కేవీ. ఇక ‘పాతాళభైరవి’తో తెలుగు సినిమాకు తొలి స్వర్ణోత్సవం చూపించారు. ఇక ‘మాయాబజార్’తో కేవీ చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యేవారి బాగోతం ఎలా ఉంటుందో తన ‘పెద్దమనుషులు’తో చాటింపేశారు కేవీ. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రం ‘దొంగరాముడు’ కూడా కేవీ నిర్దేశకత్వంలోనే రూపొందింది.

కొందరు ఏది చేసినా భలే బాగుంటుంది. మరికొందరు ఎన్ని తీసినా చూడలేం. కేవీ రెడ్డి తీసిన చిత్రాల జయాపజయాలను పక్కకు పెడితే, ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అధికశాతం ఆకట్టుకున్నవే! నాటకఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరమని కేవీ భావించారు. అంతకు ముందు మన సినిమాల్లో నాటకఫక్కీనే పలకరించేది. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చినవారే! అయితే వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు కేవీ. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. అమ్మవారి అనుగ్రహంతో కడదాకా జనం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించారు కేవీ. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరు మేరునగ సమానులైన నటులతో అలరించిన కేవీ రెడ్డి, ఆ తరువాత ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయారు.

‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో జనం ఆశ్చర్య పోయారు. అవి కేవీ తీసిన చిత్రాలే, కానీ, వాటిలో ఆయన ఠీవి కనిపించలేదన్నదే అభిమానుల ఆవేదన. కొందరు కేవీ పని అయిపోయిందన్నారు. మరికొందరు ఆయన గత చిత్రరాజాలనే తలచుకొని పులకించిపోయారు. మళ్ళీ ఏ మాయాబజారునో, లేదా ఏ జగదేకవీరుని కథనో వినిపిస్తారని ఆశించారు. అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున కేవీ మునుపటి వైభవం చూపిస్తారనే విశ్వసించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘శ్రీకృష్ణ సత్య’ను తెరకెక్కించారు కేవీ. మళ్ళీ ఆయన ఠీవి నిలచింది. ‘శ్రీకృష్ణ సత్య’నే ఆయన చివరి చిత్రం. విచిత్రమేంటంటే- ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ, ఈ తెరకృష్ణుడు నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’తోనే చిత్ర ప్రయాణం ముగించడం! ఏది ఏమైనా విజయంతో మొదలైన కేవీ సినీయానం సక్సెస్ తోనే ముగియడం అభిమానులకు ఆనందం పంచింది. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. అందుకే కేవీ రెడ్డి పేరు ఇంకా ఠీవీగానే చిత్రసీమలో నిలచి ఉందని అంటారు! కాదనగలవారెవరు!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • birth anniversary
  • KV Reddy
  • Special Story
  • tollywood director

తాజావార్తలు

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

  • Mushroom Curry Recipe: చికెన్ కర్రీ ఎందుకు..? మష్రూమ్ కర్రీ ఉండగా.. సూపర్ సాఫ్ట్ గా చేసేయండి ఇలా..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Post Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

ట్రెండింగ్‌

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions