Site icon NTV Telugu

Kushitha kallapu: బజ్జీల పాపకి గురూజీ బంపర్ ఆఫర్.. ఏకంగా మహేష్ తోనే?

Khushita Kallapu In Ssmb 28

Khushita Kallapu In Ssmb 28

Kushitha kallapu in SSMB 28: కుషిత కళ్ళపు అంటే ఎవరు అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ బజ్జీల పాప అంటే ఇంస్టాగ్రామ్ మొదలు ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె చాలా ఫేమస్. గుంటూరు జిల్లాకు చెందిన కుషిత సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చింది. అలా హైదరాబాద్ వచ్చిన ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా ఆమె కీలక పాత్రలలో నటించింది. అలాంటి తరుణంలో ఈ మధ్య జరిగిన ఒక పబ్ రైడింగ్ కేసులో ఆమె కూడా కనపడడంతో ఒకసారిగా మీడియా అటెన్షన్ ఆమె మీదకు మళ్ళింది. ఆమె పబ్బుకి వెళ్ళింది చీజ్ బజ్జీలు తినడానికి అని చెప్పడంతో అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో చీజ్ బజ్జీల పాపగా ఫేమస్ అయి పోయింది. అయితే ఆ తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఆమె కార్తీక్ రత్నం హీరోగా రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది.

Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్దికి బంపరాఫార్.. తంతే గీతా బుట్టలో పడ్డాడుగా!

అలాగే ఇటీవల గోపీచంద్ హీరోగా తెరకెక్కి విడుదలైన రామబాణం సినిమాలో కూడా గోపీచంద్ అన్న కుమార్తె పాత్రలో ఆమె నటించింది. ఇక ఇప్పుడు ఆమె మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్టు. అందులో ఆమె వేసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు 28 అనే ఒక ట్యాగ్ ఇవ్వడంతో ఆమె గురూజీ కళ్ళలో పడి ఏకంగా మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది అనే ప్రచారం మొదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీ లీల ప్రధాన పాత్రలో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా ముందుగా పూజ హెగ్డే అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఈ సినిమాలో కుషిత కళ్ళపు పాత్ర ఏమిటి అనే విషయం మీద క్లారిటీ లేదు, బహుశా హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర లేదా ఏదైనా ఇతర కీలక పాత్ర పోషిస్తుందని చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.

Exit mobile version