హైదరాబాద్-బెంగళూరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఈ విషాద ఘటనలో 19 మంది సజీవ దహనమవ్వగా, ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక, బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. క్షేమంగా ఉన్న వారిని గుర్తించాం.. ఆస్పత్రిలో వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.
Also Read : Pradeep Ranganathan: 100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్‌కి ఇచ్చిన ‘డ్యూడ్’..
తాజాగా నటి రష్మిక మందన్న ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కర్నూలు ప్రమాద బస్సు ప్రమాదం వార్త విని నా హృదయం ముక్కలైపోయింది. మండుతున్న బస్సులోని ప్రయాణికులు ఎదుర్కొన్న బాధ ఊహించలేనిది. చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన సంఘటన భయంకరంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను“ అని రష్మిక పేర్కొన్నారు.
ఇక, సోషల్ మీడియాలో ఇతర సెలబ్రిటీలు కూడా స్పందించారు. నటుడు సోనూసూద్ ట్వీట్‌లో.. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 2 వారాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలు చాలు, ఇప్పుడు కఠిన నిబంధనలు అమలు చేయడం తప్పనిసరి’ అని హెచ్చరించారు. అలాగే, కిరణ్ అబ్బవరం కూడా.. ‘కర్నూలు జిల్లాలో జరిగిన విషాద ఘటనపై చాలా బాధపడ్డారు.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు భగవంతుడు బలాన్నివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
