NTV Telugu Site icon

Kurchi Tatha: పవన్ ఫాన్స్ తో గొడవ.. వారం రోజులుగా కుర్చీతాత మిస్సింగ్.. ఎక్కడ దొరికాడంటే?

Kurchi Tatha Missing

Kurchi Tatha Missing

Kurchi Tatha Missing: సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి అని డైలాగ్ తో ఫేమస్ అయి కుర్చీ తాత అని పేరు తెచ్చుకున్నాడు హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా. ఆ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ అతని జీవితాన్నే మార్చేసింది. అప్పటి వరకు ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేస్తూ వచ్చిన అతను సోషల్ మీడియా సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ ప్రమోషన్లు చేస్తూ సంపాదించుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు పవన్ అభిమానులు ఆయనపై ఫైరయ్యారు.

Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!

కుర్చీ తాత జగన్ మీద అభిమానంతో గతంలో పవన్ విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, దీంతో పవన్ అభిమానులు మీకు జగన్ అంటే ఇష్టమైతే ఆయనను పొగడండి, కానీ పవన్ ను తిట్టడానికి మీరు ఎవరు అంటూ సదరు వీడియోలోనే ప్రశ్నిస్తుండగా ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ గొడవ జరిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లడం మానేశాడట. సుమారు 7 రోజులు పాటు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక యూట్యూబ్ ఛానల్ ఆశ్రయించి ఆయన ఎక్కడ ఉన్నా ఆచూకీ తెలపాలని కోరారు. అయితే ఈ వీడియో చూసిన కొంత మంది కుర్చీ తాత వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉంటున్నాడని అక్కడే ఎవరైనా పెట్టింది తిని నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెళ్లి ఆయనని హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ కుర్చీ తాత మాట్లాడిన కొచ్చి మడతపెట్టి డైలాగ్ తోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఒక పాట సిద్ధం చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

Show comments