Site icon NTV Telugu

KS. Ramarao : మెగాస్టార్, మెగా హీరోలకు కె. ఎస్. రామారావు అభినందనలు

ks ramarao

ks ramarao

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టించిన మెగా స్టార్ చిరంజీవికి, ఇతర మెగా హీరోలకు, మెగా దర్శకులకు కె.ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. అలానే తెలుగు చిత్రసీమలోని సమస్యలను అర్థం చేసుకుని, సత్వరమే పరిష్కరించిన జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

Exit mobile version