NTV Telugu Site icon

Lal Singh Chadda: ‘ఈ సినిమాతో అమీర్ కెరీర్ ముగిసిపోతుంది’

Krk

Krk

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తునం విషయం విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కు సిద్ధం కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంతోనే అక్కినేని నట వారసుడు నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అయితే ఈ సినిమాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకొనే కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే. ఏ సినిమాపైనే పాజిటివ్ రివ్యూ ఇవ్వని కమల్.. నెగెటివ్ రివ్యూ లతోనే ఫేమస్ అయ్యి నెటిజన్ల ఆగ్రహానికి గురి అవుతూ ఉంటాడు.

మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసి అభిమానుల చేత తిట్టించుకున్న కేఆర్కే తాజాగా అమీర్ సినిమాపై కామెంట్స్ చేసి మరోసారి ట్రోల్ అవుతున్నాడు. అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంపై కమల్ ట్వీట్ చేస్తూ “లాల్ సింగ్ బుద్ధా చిత్రంపై నాకు రోజూ నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే ఈ సినిమాను అమీర్ రిలీజ్ చేయకుండా ఉంటే బావుంటుందని నా నమ్మకం. ఇది ఖచ్చితంగా పెద్ద డిజాస్టర్ అవుతుంది.. దీంతో అమీర్ కెరీర్ ముగిసిపోతుంది” అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వొక పెద్ద క్రిటిక్ వి.. నువ్వు చెప్పింది వినాలా..? అని కొందరు.. నీ జీవితంలో ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడవా.. ఛీఛీ..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments