Site icon NTV Telugu

Ajayante Randam Moshana: త్రీడీ మూవీతో మల్లూవుడ్‌లోకి ‘ఉప్పెన’ భామ

Krithi Shetty

Krithi Shetty

Ajayante Randam Moshana: ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి, బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డునూ గెలుచుకుంది. ‘బంగార్రాజు’లో వినోదాన్ని పండించిన కృతి, ‘శ్యామ్ సింగరాయ్’లో కాస్తంత భిన్నమైన పాత్రను పోషించింది. ఇక రామ్ సరసన రేడియో జాకీగా ‘ది వారియర్’లో నటించి, తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చింది. అలానే ప్రస్తుతం నాగచైతన్య బైలింగ్వల్ మూవీలోనూ కృతి నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు బాలా.. సూర్యతో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ ఈమె ఛాన్స్ దక్కించుకుంది.

Read Also: Rajinikanth: గాడ్ ఫాదర్ పై తలైవా రివ్యూ.. దేన్నీ వదిలిపెట్టలేదే

ఇదిలా ఉంటే… ఇప్పుడీ సొట్టబుగ్గల చిన్నది మల్లూవుడ్ లోకి అడుగుపెడుతోంది. టొవినో థామస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘అజయంతే రండమ్ మోక్షన’ మూవీలో కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. త్రీడీలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మంగళవారం పూజా కార్యక్రమాలతో తమిళనాడులోని కారైకుడిలో మొదలైంది. సుజిత్ నంబియార్ కథను అందిస్తున్న ఈ చిత్రంతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ పిరియాడికల్ మూవీ 1900, 1950, 1990లలో జరుగుతుందని, ఈ మూడు సమయాల్లోనూ మూడు భిన్నమైన పాత్రలలో టొవినో థామస్ కనిపిస్తాడని, ‘మణియన్, అజయన్, కుంజికేలు’ అనే పాత్రలను పోషిస్తున్నాడని, ఈ మూవీ కోసం టొవినో కలరిపయట్టు యుద్థకళను అభ్యసించాడని లాల్ తెలిపారు. దాదాపు 45 రోజుల పాటు కలరికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారట. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను ఐశ్వర్యా రాజేశ్‌, సురభి లక్ష్మీ, రోహిణి, బాసిల్ జోసఫ్‌, హరీష్‌ ఉత్తమన్, హరీశ్ పేరడీ పోషించబోతున్నారు.

Exit mobile version