హీరోలకు ఇచ్చే మర్యాదలో హీరోయిన్లకు ఎందుకివ్వరని నటి, హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఐక్యరాజ్య సమతి పాఫులేషన్ ఫండ్ సంస్థకు ఆమె ఇండియా తరఫు నుంచి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు.
వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లింగ వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అవకాశాలు.. హీరోయిన్లకు ఉండవని.. ప్రతి ఒక్క విషయంలో తమను చిన్న చూపు చూస్తారని ఆమె ఆరోపించారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడంలో కూడా అసమానతలు చూపుతున్నారని ఆమె మండిపడ్డారు. కొన్ని సార్లు ఈ విషయంపై బాధపడ్డానని ఆమె తెలిపారు. హీరోలకు పెద్ద పెద్ద కార్లు, విలాసవంతమైన గదులు కేటాయిస్తారని.. ఇవన్ని చిన్న విషయాలే అయినప్పట్టికి.. ఇలా చేయడంతో చాలా బాధగా ఉంటుందన్నారు.
తాను సౌకర్యాల గురించి మాట్లాడడం లేదని.. మహిళలను తక్కువ చేసి చూడడం గురించి మాట్లాడుతున్నానని కృతి సనన్ అన్నారు. హీరోలతో పాటు తాము కూడా అర్హులమేనని.. చెప్పుకొచ్చారు. షూటింగ్ టైంలో కూడా.. హీరోయిన్స్ టైం కంటే ముందే ఉండాలి.. కానీ హీరోలు సెట్స్ కు ఎప్పుడు వచ్చిన ఏమి అనరని.. తాము ఆలస్యంగా వస్తే మాత్రం.. ఎందుకు ఆలస్యమైందని అడుగుతారు. హీరోలను మాత్రం ఏమి అడగరని ఆమె అన్నారు. ఇలాంటి ఆలోచన సరళిలో మార్పు రావాలని కృతి సనన్ అన్నారు. తన తల్లి ఒక ప్రొఫెసర్ అని.. ఎప్పుడు తమకు అడ్డంకులు పెట్టలేదని..తమకు పూర్తి స్వేచ్ఛ నిచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
