NTV Telugu Site icon

Kriti Sanon: వరుణ్ ధావన్ వల్ల ప్రభాస్ కి సారీ చెప్పాల్సి వచ్చింది…

Kriti Sanon

Kriti Sanon

ఆది పురుష్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు అనే రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ప్రభాస్ ఫాన్స్ కూడా కృతి సనన్ ని వదినా అంటూ ట్వీట్స్ చేశారు. ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కృతి ప్రేమలో పడ్డారు. షూటింగ్ ఉన్నా లేకున్నా ప్రభాస్ ముంబై వెళ్లి మరీ కృతిని కలుస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ కృతి చాలా క్లోజ్ గా కనిపించడంతో ఈ ప్రేమ వ్యవహారం నిజమయ్యి ఉంటుందని అంతా నమ్మారు. ఈ రూమర్ కి మరింత ఆజ్యం పోశాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.

‘తోడేలు’ ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోకి వెళ్లిన వరుణ్ ధావన్, కరణ్ జోహార్ తో మాట్లాడుతూ… “కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పడుకోణెతో షూటింగ్ లో ఉన్నాడు” అంటూ హింట్ ఇచ్చాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కృతి సనన్ సిగ్గు పడుతూ నవ్వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సాలిడ్ గా వైరల్ అయ్యింది. నేషనల్ వైడ్ వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో కృతి సనన్ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి మరీ “వరుణ్ ధావన్ జోక్ గా అలా చేశాడు, నిజంగా అది రూమర్ మాత్రమే” అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వరుణ్ ధావన్ కేవలం తన సినిమా ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడాడు అనే విషయం అందరికీ అర్ధం అయ్యింది.

చాలా రోజుల తర్వాత కృతి సనన్, వరుణ్ ధావన్ కామెంట్స్ గురించి రెస్పాండ్ అయ్యింది. స్టేజ్ పైన వరుణ్ ధావన్ అలా మాట్లాడిన తర్వాత నేను ప్రభాస్ కి కాల్ చేసి సారీ చెప్పాల్సి వచ్చింది. “వరుణ్ నా ఫ్రెండ్, తనకి కాస్త పిచ్చి క్రేజీగా ఎదో మాట్లాడేసాడు సారీ” అని కృతి సనన్, ప్రభాస్ కి కాల్ చేసి సారీ చెప్పిందట. అసలు వరుణ్ అలా ఎందుకు మాట్లాడాడని ప్రభాస్ అడిగాడు కానీ ఏమో నాకు కూడా తెలియదు కానీ అలా మాట్లాడేసాడు అని చెప్పను. ఆ తర్వాత నేను ప్రభాస్ బాగా నవ్వుకున్నాం అంటూ కీర్తి సనన్ అప్పటి విషయంలో జరిగింది చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Adipurush ట్యాగ్ ట్రెండ్ అవుతుండడంతో కృతి సనన్ షెహజాదా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Show comments