డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ మరో సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా మరోసారి నితిన్ తో కలిసి నటిస్తుంది.ఇది భీష్మ కాంబో అని అందరికి తెలిసిందే.. వెంకీ కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాల లో రష్మిక మందన్న నే హీరోయిన్ గా అయితే నటించింది. ఇక ఇప్పుడు ముచ్చట గా మూడవసారి కూడా ఈ భామనే ఎంపిక చేసుకున్నాడని తెలుస్తుంది.. ఛలో మరియు భీష్మ సినిమాల తో వరుసగా రెండు హిట్స్ అందుకుని ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకీ ఇప్పుడు మూడవ సినిమాను ఇంకా బాగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.
మూడేళ్ళ పాటు గ్యాప్ తర్వాత వెంకీ మళ్ళీ సినిమా ను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ కూడా బయటకు రాగ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాలో కృతి శెట్టి కూడా నటించనుంది అని సమాచారం.. ఇది వరకే నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది కృతి శెట్టి. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అయితే నితిన్ కృతి శెట్టి జంట కు మంచి పేరు వచ్చింది.ఈ ఇద్దరు కలిసి మరో సినిమా లో నటిస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.మరి కృతి శెట్టి ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందో మరీ చూడాలి.. ఇదిలా ఉండగా కథ విషయానికి వస్తే ఒక నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఒక వ్యక్తి తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు… ఎలాంటి సంఘటనలు అతను ఎదుర్కున్నాడు అనే దానిపై వెంకీ ఈ సినిమాను ఎంతో ఫన్నీ గా తెరకెక్కించ బోతున్నాడని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండ గా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారుని సమాచారం