కృతి శెట్టి… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ‘బేబమ్మ’గా సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయని కృతి శెట్టి ప్రూవ్ చేసుకోవడంతో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటుంది అనుకున్న కృతి శెట్టి, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో సడన్ గా కెరీర్ ని రిస్క్ లో పడేసుకుంది. అందుకే మొన్నటి వరకు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న కృతి.. ఇప్పుడు అసలు ఇండస్ట్రీలో ఉందా? లేదా? అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా ‘ది వారియర్’ సినిమా తర్వాత కృతి శెట్నిటి పట్టించుకునే వారే లేకుండా పోయారు. సూర్య, బాలా కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించాల్సి ఉంది కానీ ఆ సినిమా ఆగిపోయింది. తమిళ్ లో కార్తితో మాత్రమే కృతి శెట్టి నటిస్తోంది, ఇది కాకుండా తమిళనాడులో కృతి మరో సినిమా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలన్నీ ‘కస్టడీ’ సినిమా పైనే ఉన్నాయి.
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కస్టడీ సినిమా హిట్ అయితే రెండు భాషల్లో మళ్లీ తను బిజీ అవ్వొచ్చు అనేది కృతి శెట్టి ఆలోచన. ఇదిలా ఉంటే ఓ మలయాళ సినిమా కోసం కృతి గ్లామర్ డోస్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో కృతి శెట్టి తొలిసారి బికినీ షో చేసేందుకు ఒప్పుకుందంట. అందుకోసం అమ్మడు భారీగా డిమాండ్ చేస్తుందని సమాచారం. మేకర్స్ కూడా అందుకు ఓకే చెప్పారట. ఈ యంగ్ బ్యూటీని బికినీలో చూపించడానికి మేకర్స్ ఏకంగా 4 కోట్లు సమర్పించుకుంటున్నారట. ఒక్క బికినీ మాత్రమే కాదు.. ఇంకొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటివరకూ స్కిన్ షోకి కాస్త దూరంగా వచ్చిన కృతి శెట్టి, ఇప్పుడు ఆ బౌండరీలని చెరిపే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది, అందుకే మలయాళ సినిమా ఒప్పుకుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా ఇటివలే కృతి పోస్ట్ చేస్తున్న ఫోటోస్ కూడా గ్లామర్ గానే ఉంటున్నాయి. దీంతో కృతి గ్లామర్ డోస్ పెంచినట్టేనని చెప్పొచ్చు. మరి ఈ గ్లామర్ షో అయినా కృతి శెట్టిని మళ్లీ స్టార్ హీరోయిన్ ని చేస్తాయేమో చూడాలి.
